సిరాన్యూస్, జైనథ్
వేసవిలో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి : డాక్టర్ నైనత
వేసవిలో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నైనత అన్నారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని జడ్పీ హెచ్ ఎస్ పాఠశాలలో గురువారం నేషనల్ అయోడిన్ డెఫిషియన్సీ కంట్రొల్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఈసందర్భంగా 90 మంది విద్యార్థులకు సాల్ట్ సర్వే చేపట్టారు. సాల్ట్, యూరిన్ సాంపిల్స్ ల్యాబ్ కి పంపడం జరిగింది. అనంతరం డాక్టర్ నైనత మాట్లాడుతూ..వడ దెబ్బ లక్షణాలు, ఎండాకాలం లో తీసుకోవల్సిన జాగ్రత్తలు గురించి విద్యార్థులకు వివరించారు. ఓఆర్ఎస్ ఉపయోగాలు వివరించారు. కార్యక్రమంలో సీహెచ్ ఓ అంజయ్య, ఏఎన్ఎం, విద్యార్థులు పాల్గొన్నారు.