సిరాన్యూస్, ఆదిలాబాద్
నులిపురుగుల నివారణంతో ఆరోగ్యం : మెడికల్ ఆఫీసర్ నైనత
నులిపురుగులను నివారిస్తేనే చిన్నారుల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని జైనథ్ మెడికల్ ఆఫీసర్ నైనత అన్నారు. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా గురువారం ఆదిలాబాద్ జిల్లా జైనథ్ గ్రామంలో మోడల్ స్కూల్ లో ప్రారంభించారు. ఈసందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సంబంధించిన గవర్నమెంట్ స్కూల్స్ అంగన్వాడీ సెంటర్స్, ప్రైవేట్ స్కూల్స్ పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్, సీహెచ్ ఓ, సూపర్ వైజర్, స్కూల్ స్టాఫ్,ఏఎన్ఎం, ఆశా వర్కర్స్ హాజరయ్యారు.