సిరాన్యూస్,జైనథ్
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి: డాక్టర్ నైనత
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ నైనత అన్నారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం లోని రైతు వేదికలో సీజనల్ వ్యాధుల గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సంధర్భంగా డాక్టర్ నైనిత మాట్లాడుతూ గ్రామాల్లో సరైన పారిశుద్ధ్య నిర్వహణ వల్ల వర్షా కాలంలో వచ్చే సీజనల్ వ్యాధులను ఏ విధంగా నిర్మూలించవచ్చో వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులకు వివరించారు.అలగే జైనథ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎస్ఏఎం,ఎంఏఎం లో బాగంగా తక్కువ బరువు ఉన్న పిల్లలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. 3 ఎస్ఏఎం కేసులను రిమ్స్ కు రిఫర్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ శ్యామ్ సుందర్, ఎంపీడీఓ రవీంద్ర నాథ్, వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శుల పాల్గొన్నారు.