సిరాన్యూస్, ఇచ్చోడ
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా ట్రైనింగ్ టీం ప్రోగ్రాం అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్
ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా ట్రైనింగ్ టీం ప్రోగ్రాం అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన సందర్శించారు. రోగులకు అందిస్తున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్య సిబ్బందితో సమావేశమై ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సూచనలు అందించారు. అనంతరం మండలంలోని దుబార్ పేట్ గ్రామంలో వైద్య శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు వ్యక్తిగత శుభ్రతతో పాటు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. నీరు నిల్వ ఉండటం వలన దోమలు వృద్ధి చెంది డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, లాంటి వ్యాధులు ప్రబలుతాయని అన్నారు. అనంతరం ఫీవర్ సర్వే గురించి వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్ కిరణ్ కుమార్ వైద్య సిబ్బంది పాల్గొన్నారు.