Dr. Naresh: వ్య‌క్తిగ‌త శుభ్ర‌త పాటించాలి: ఆర్బిఎస్కే వైద్యులు డాక్టర్ నరేష్

సిరాన్యూస్, ఇచ్చోడ‌
వ్య‌క్తిగ‌త శుభ్ర‌త పాటించాలి: ఆర్బిఎస్కే వైద్యులు డాక్టర్ నరేష్
* 120 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు
* ఉచితంగా అద్దాలు అంద‌జేత‌

ప్ర‌తి ఒక్క‌రూ వ్య‌క్తిగ‌త శుభ్ర‌త పాటించాల‌ని, చిన్నప్పటి నుండె వ్యాధులపై అవగాహన పెంచడం వల్ల పిల్లలు శుభ్రత, పరిశ్రుభతను పాటిస్తారని ఆర్బిఎస్కే వైద్యులు డాక్టర్ నరేష్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని గుండాల గ్రామంలో మండల ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు జిల్లా అందత్వ నివారణ సంస్థ, ఆర్బిఎస్కే ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా 120 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా అద్దాలు పంపిణీ చేసినట్లు ఆర్పీఎస్కే వైద్యులు డాక్టర్ నరేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు ఆరోగ్యంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *