Dr. Sarfaraz: ప‌రిస‌రాల‌ను ప‌రిశుభ్రంగా ఉంచుకోవాలి: డాక్ట‌ర్ సర్ఫరాజ్

సిరా న్యూస్, ఆదిలాబాద్‌
ప‌రిస‌రాల‌ను ప‌రిశుభ్రంగా ఉంచుకోవాలి: డాక్ట‌ర్ సర్ఫరాజ్
* అంకొలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో ప్రపంచ మలేరియా దినోత్సవం

ప్ర‌తి ఒక్క‌రూ ప‌రిస‌రాల‌ను ప‌రిశుభ్రంగా ఉంచుకోవాలని డాక్ట‌ర్ సర్ఫరాజ్ అన్నారు. గురువారం ఆదిలాబాద్ రూరల్ మండలంలోని అంకొలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని నిర్వ‌హించారు. ఈసంద‌ర్భంగా డాక్ట‌ర్ సర్ఫరాజ్ మాట్లాడుతూ పూలకుండీలు, టైర్లు, డబ్బాలు, మురికి కాల్వ‌ల్లో నీరు నిల్వవుండకుండా ప్రతిరోజు చూసుకోవాలని చెప్పారు. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఇంటి వద్ద ఉంచుకున్నట్టుయితే దోమలు దరికిరావని తెలిపారు. అదేవిధంగా దోమ లు వృద్ధి చెందకుండా రాత్రి పొగ వేసుకోవాలని ,దోమతెరలు వాడాలని తెలిపారు. కార్యక్రమంలో ఆరోగ్య ప‌ర్య‌వేక్ష‌కులు బొమ్మెత సుభాష్, మర్సకొల లక్ష్మీ బాయి ,ఆరోగ్య కార్యకర్తలు నల్ల ఈశ్వర్ రెడ్డి, పవర్ ప్రేమ్ సింగ్,ఈశ్వరి దేవి, వేణు తాయి, ల్యాబ్ టెక్నిషన్ మడవి శ్రీనివాస్, తిరుమల,కిష్టన్న, ఆశకార్యకర్తలు పద్మ,కవితలు గ్రామప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *