Dr. Sarfaraz: ప‌రిస‌రాల‌ను ప‌రిశుభ్రంగా ఉంచుకోవాలి :డాక్ట‌ర్‌ సర్ఫరాజ్

సిరాన్యూస్, ఆదిలాబాద్‌
ప‌రిస‌రాల‌ను ప‌రిశుభ్రంగా ఉంచుకోవాలి :డాక్ట‌ర్‌ సర్ఫరాజ్
* అంకొలి పీహెచ్‌సీలో జాతీయ డెంగ్యూ దినోత్సవం

ప్ర‌తి ఒక్క‌రూ ప‌రిస‌రాల‌ను ప‌రిశుభ్రంగా ఉంచుకోవాల‌ని డాక్ట‌ర్ స‌ర్ఫ‌రాజ్ అన్నారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ రూర‌ల్ మండ‌లంలోని అంకోలి ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని డా.సర్ఫరాజ్ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించారు. ఈసంద‌ర్బంగా డాక్ట‌ర్ స‌ర్ఫరాజ్ మాట్లాడుతూ ఈ డెంగ్యూ వ్యాధి ఎడిస్ ఈజిప్టు అనే దోమ కుట్టడం వల్ల వస్తుంద‌ని తెలిపారు. అలాగే ఇది కుట్టినప్పుడు జ్వరం, తలనొప్పి, కళ్ళనొప్పులు, కీళ్లనొప్పులు,ఆకలి మందగించడం, వికారం, వాంతులు వచ్చినట్టు అనిపించడం వాంతి చేసుకోవడం ఈ వ్యాధి లక్షణాలు ఉంటాయ‌ని తెలిపారు. రాబోయే జూన్ నెల నుండి వ‌ర్షాకాలం ప్రారంభమ‌వుతుంద‌ని, ఇంటి వద్ద డ‌బ్బాలలో ,పాత టైరు లలో, పూలకుండీలలో, కవర్లలో,మురికి గుంటలలో నీరు ఆగకుండా చూసుకోవాల‌ని తెలిపారు. ఇంటి ప‌రిస‌రాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు శుభ్రంగా ఉంచుకోవాల‌ని తెలిపారు. ఈకార్యక్రమంలో ఆరోగ్య ప‌ర్య‌వేక్ష‌కులు బొమ్మెత సుభాష్, ఆడే సురేష్ , కొడప యశోద, లక్ష్మీ బాయి ,ఖండాల ఎంఎల్ హెచ్‌పీ మైజోఉద్దీన్, ఆరోగ్య కార్యకర్తలు నల్ల ఈశ్వర్ రెడ్డి, పవర్ ప్రేమ్ సింగ్,ఇందు బాయి, అశాకార్య కర్తలు జయ, రుక్మిణి, సునీత, సుమిత్ర, అనసూయ,లక్ష్మి,జన బాయి, స్టాఫ్ నర్స్ గంగామణి,తిరుమల, గర్భవతులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *