Dr. Shyam Prasad Mukherjee’s birth anniversary : గుంజపడుగులో ఘనంగా డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ జయంతి

సిరా న్యూస్,మంథని;
హిందూ జాతీయవాద నాయకుడు , 370 ఆర్టికల్ రద్దు కోసం పోరాడి దేశంలో ఒకే చట్టం ఒకే జెండా ఒకే రాజ్యాంగం ఉండాలని కోరుకున్న జనసంఘ్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్యాం ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలను మంథని మండలం గుంజపడుగు గ్రామంలో బీజేపీ మంథని మండల అధ్యక్షుడు విరబోయిన రాజేందర్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. అనంతరం దేశ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు అమ్మ పేరుతో మొక్కలను నాటారు.
ఈ కార్యక్రమంలో మండల కోశాధికారి ఎల్కా సాదానందం, బూత్ అధ్యక్షులు మనుక కొమురయ్య, బూడిద విష్ణు వర్ధన్, కంచు మల్లేష్, సీనియర్ నాయకుడు గుమ్మడి శ్రీనివాస్, విరబోయిన తిరుపతి, కాయితి శ్యామ్, సాదుల సురేష్ తదితలు పాల్గొన్నారు.
=========================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *