సిరాన్యూస్, చర్ల
వ్యక్తిగత శుభ్రత పాటించాలి: డాక్టర్ శ్రీధర్
* గొంపల్లి లో వైద్య శిబిరం
ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రత పాటించాలని డాక్టర్ శ్రీధర్ అన్నారు. గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గల గొంపల్లి గ్రామంలో డాక్టర్ శ్రీధర్ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ హెల్త్ క్యాంప్‌లో 55 మంది చిరువ్యాధులకు వైద్యం అందించారు. ఈసందర్భంగా డాక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ కాచి చల్లార్చిన నీటిని తాగాలని, నీటి నిల్వలు లేకుండా వారానికి రెండుసార్లు నీటి డ్రమ్ములను శుభ్రపరుచుకోవాలని తెలిపారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, అందరూ దోమతెరలు కట్టుకోవాలని గ్రామస్తులకు సూచించారు. హెల్త్ సిబ్బంది ఇంటింటికి తిరిగి యాంటీ లార్వా సర్వే చేసి లార్వా ఉన్నటువంటి కంటైనర్లను తొలగించారు. కార్యక్రమంలో సబ్ యూనిట్ ఆఫీసర్ ధర్మారావు, హెల్త్ సూపర్‌వైజర్ రాంప్రసాద్, మలేరియా టెక్నికల్ సూపర్ వైజర్ రామకృష్ణ, హెల్త్ అసిస్టెంట్ జోగమ్మ, బ్రీడింగ్ చక్కెర్ సాయి ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.