సిరాన్యూస్, ఓదెల
జూన్ 10న సదరం స్లాట్ బుకి చేసుకోవాలి: డీఆర్‌డీఓ ఆర్. రవీందర్
పెద్దపల్లి జిల్లాలోని దివ్యాంగుల వైద్య నిర్ధారణ పరీక్షల కోసం జూన్ 10న సోమవారం ఉదయం 11-35 గంటల నుండి మీ- సేవా కేంద్రాల్లో స్లాట్ బుక్ చేసుకోవాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ఆర్.రవీందర్ తెలిపారు.కొత్తగా సదరం సర్టిఫికేట్ కావాల్సిన వారు, తాత్కాలిక సదరం సర్టిఫికేట్ ఉన్నవారు రెన్యువల్ కోసం దరఖాస్తులు చేసుకోవాలని, మానసిక అంగ వైకల్యం, బుద్ది మాన్యం ఉన్న వారు జూన్ 13న నిర్వహించు క్యాంప్ స్లాట్ కొరకు, దృష్టి లోపం, వినికిడి లోపం ఉన్నవారు జూన్ 20న నిర్వహించే క్యాంప్ స్లాట్ కోసం, శారీరక అంగ వైకల్యం గలవారు జూన్ 27నాటి క్యాంప్ స్లాట్ కోసం జూన్ 10న ఉదయం 11-35 గంటల నుండి మీ సేవా కేంద్రాల్లో స్లాట్ నమోదు చేసుకోవాలని, స్లాట్ బుకింగ్ అనంతరం మెడికల్ క్యాంపులకు వచ్చే సందర్భంలో దరఖాస్తుదారులు మీసేవ సదరం స్లాట్ బుకింగ్ రసీదుతో పాటు వికలాంగత్వ పరీక్షా కాపీ, ఆధార్ కార్డు జిరాక్స్, పాస్ పోర్ట్ సైజ్ ఫోటో, వ్యక్తిగత మెడికల్ రిపోర్ట్ లను తీసుకొని రావాలని డీఆర్‌డీఓ ఆర్.రవీందర్ ఆ ప్రకటనలో తెలిపారు.