సిరా న్యూస్, భీంపూర్
ఘనంగా జాతీయ మహిళా దినోత్సవం
* సోయం రాధాబాయ్కు ఘన సన్మానం
ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మంలంలోని రోజ్గోండ్ గ్రామంలో గురువారం డ్రీమ్ సొసైటీ ఆధ్వర్యంలో జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా డ్రీమ్ సొసైటీ సభ్యులు మాట్లాడారు. మహిళా లు సాధిస్తున్న విజయాలు వారి ప్రాధ్యానతను వారు తమ కుటుంబాల కోసం చేసే సేవ త్యాగాలు వివరించారు. అనంనతరం గ్రామం లో ఎస్‌హెచ్‌జీ గ్రూప్ లీడర్ సోయం రాధాబాయ్ ఘనంగా సన్మానం చేశారు. కార్యక్రమంలో డ్రీమ్ సొసైటీ మేనేజేర్ జంగు బాబు, క్లాస్టర్ కో ఆర్డినేటర్లు పాల్గొన్నారు.