Dream Society Chinnaiah: పంటల అభివృద్ధికి నానో యూరియా దోహదం:  డ్రీమ్ సొసైటీ కోఆర్డినేటర్ చిన్నయ్య

సిరాన్యూస్‌, నిర్మ‌ల్‌
పంటల అభివృద్ధికి నానో యూరియా దోహదం:  డ్రీమ్ సొసైటీ కోఆర్డినేటర్ చిన్నయ్య
* నానో యూరియా, నానో డీఏపి పై అవగాహన

పంటల అభివృద్ధికి నానో యూరియా దోహ‌దం ప‌డుతుంద‌ని డ్రీమ్ సొసైటీ కోఆర్డినేటర్ చిన్నయ్య అన్నారు. శుక్ర‌వారం నిర్మల్ జిల్లాలోని ముజ్గి గ్రామంలో డ్రీమ్ సొసైటీ ఆధ్వర్యంలో నానో యూరియా ,నానో డీఏపీ పైన అవగాహన కల్పించి డెమో చేయడం జరిగింది. ఈసంద‌ర్భంగా డ్రీమ్ సొసైటీ కోఆర్డినేటర్ చిన్నయ్య మాట్లాడుతూ నానో యూరియా నత్రజని అందించే ఎరువు, మొక్కలలో పచ్చదనం, చురుకైన పెరుగుదల, పంటల అభివృద్ధికి దోహదపడుతుంద‌ని తెలిపారు. యూరియాను ఎక్కువగా వాడడం వల్ల పంటలు పురుగు, తెగుళ్లకు ఎక్కువగా లోనవుతాయి, పంట పరిపక్వత ఆలస్యమైతుంది, ఇతర పోషకాల లోపం కారణంగా పంట పడిపోవటం జరుగుతుందని చెప్పారు. ఈ నానో యూరియా 500ఎంఎల్‌ 6-8 పంపులకు పిచికారి చేసుకోవాలని చెప్పి వన్నెల మహేందర్ వరి పంటకి డెమో చేయడం జరిగింది. అదే విధంగా నానో డీఏపి అనేది అన్ని పంటలకు వాడవచ్చనీ, నానో డీఏపిలో నత్రజని 8.0శాతం భాస్వరం 16.0 కలిగి ఉంటుంద‌ని తెలిపారు. పర్యావరణానికి హాని కలిగించకుండా పంటల పోషక అవసరాలను తీరుస్తుందని చెప్పి పిప్పెర కళ్యాణ్ మొక్కజొన్న పంటలో నానో డీఏపి డెమో చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో క్లైమేట్ చాంపియన్ నవీన్, గ్రామ అభివృద్ది ఫోరమ్ సభ్యులు, రైతులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *