లోకేశ్వరం, సిరా న్యూస్
నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండల కేంద్రంలో మండల పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఎమ్మెల్యే రామారావు పటేల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమావేశంలో పలు సమస్యలు ఏకరువు పెట్టారు. తాగునీటి సమస్య వేధిస్తోందన్నారు మిషన్ భగీరథ డీఈ ఆదిత్య తాగునీటి సమస్య పరిష్కారానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో సాల్మన్రాజ్, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.