సిరా న్యూస్, భీంపూర్:
తాగునీటికి తండ్లాట…
+ గుంజాలలో తీవ్ర నీటి కటకట
+ మిషన్ భగీరథ నీళ్లు రాక ఇబ్బందులు
ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని గుంజాల గ్రామంలో మిషన్ భగీరథ నీళ్లు రాక గత 3 నెలలుగా గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. తాగునీళ్లు లేకపోవడంతో హ్యాండ్ పంపులు, బావుల వద్ద బారులు తీరుతున్నారు. స్థానిక నాయకులు, అధికారులకు ఎన్ని సార్లు చెప్పిన ఎవరు పట్టించు కోవడంలేదని వాపోతున్నారు. నీటి కటకటతో వాగులోంచి ఎడ్ల బండ్లతో నీళ్లు తెచ్చుకుంటున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. గత్యంతరం లేక వాగు నీటిని తాగు నీటికి వాడుతున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. దీంతో తరచుగా అనారోగ్యానికి గురవుతున్నామని, అధికారులు, నాయకులు పట్టించుకుని తాగునీటి సమస్య తీర్చాలని వేడుకుంటున్నారు.