గిరిజనుల త్రాగునీటి కష్టాలు

వర్షాకాలం వచ్చినా కూడా తప్పని త్రాగునీటి కష్టాలు

త్రాగునీరు కోసం కిలోమీటర్ల మేర ప్రయాణం

త్రాగు నీటి కష్టాలు తొలగించాలని గిరిజనుల డిమాండ్

సిరా న్యూస్,వికారాబాద్;

యాలాల మండలం తొప్పర్లగడ్డ తండాలో త్రాగునిటి కష్టాలు.

వర్షాకాలం వచ్చినా కూడా గిరిజనులకు నీటి కష్టాలు తప్పడం లేదు. కిలోమీటర్ల మేర తాగునీటి కోసం అవస్థలు పడాల్సి వస్తుంది. గత ప్రభుత్వంలో మిషన్ భగీరథ ఉన్నా కూడా తాగునీరు అందని పరిస్థితి. త్రాగునీరు అందించాలని గిరిజనవాసులు వాపోతున్నారు. ఈ త్రాగునీటి కష్టాలు వికారాబాద్ జిల్లా మండల పరిధిలోని సంగయ్యగుట్ట తాండ గ్రామపంచాయతీ అనుబంధ గ్రామమైన తొప్పర్ల గడ్డ తాండ నెలకొంది. సీఎం సొంత జిల్లా పరిధిలోని యాలాల మండలం తొప్పర్ల గడ్డ తండాలో తాగునీటి కోసం గిరిజనులు పడుతున్నారు.గుప్పెడు నీటి కోసం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు కిలోమీటర్ల మేర ప్రయాణం చేసి త్రాగునీరు తీసుకుని వస్తున్నారు. గత ప్రభుత్వ0 అందించిన మిషన్ భగీరథ పథకం ద్వారా వచ్చే నీరు నల్లాలకే పరిమితం అయ్యాయి కానీ నీరు మాత్రం ఉపయోగంలోకి రాలేదు. సంగయ్యగుట్ట గ్రామపంచాయతీ పరిధిలోని తొపెర్లగడ్డ తండాలో సుమారు 50 గిరిజన కుటుంబాలు నివసిస్తున్నాయి. వీరికి రోజు త్రాగునీటి ఇబ్బందులు మాత్రం తప్పడం లేదు. గతంలో వ్యవసాయ పొలం ఉన్నటువంటి బోరు నుండి నీటిని సరఫరా చేసేవారు. ఇప్పుడు ఆ బోర్డు నుండి నీటి సరఫరా ఆగిపోవడంతో తండావాసులు తీవ్రంగా తాగునీటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించి వెంటనే తమకు తాగునీటి కష్టాలు తీర్చాలని గిరిజన తండావాసులు మీడియా ముందు వాపోయారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *