సిరా న్యూస్,సంగారెడ్డి;
మాదక ద్రవ్యాలు, హెరాయిన్, ఓపియం డ్రగ్స్ ను అమ్ముతున్న ముఠా సభ్యులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు సంగారెడ్డి జిల్లా ఏఎస్పీ సంజీవరావు తెలిపారు. ఈ మేరకు సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏఎస్పీ సంజీవరావు వివరాలు వెల్లడించారు. పటాన్ చెరు మండలం చిట్కుల్ లో డ్రగ్స్ ముఠా కదలికలపై సమాచారం అందుకున్న TNAP DSP పుష్పన్ కుమార్, ఎస్ ఓ టీ సైబరాబాద్ డీసీపీ శ్రీనివాస్, అడిషనల్ డీసీపీ, పటాన్ చెరు పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించామన్నారు.
చిట్కుల్ గ్రామములోని బిగారి మాణిక్యం ఇంట్లో రాజస్తాన్ కు చెందిన బుద్దారాం, కోశాల రామ్ ఇద్దరు వ్యక్తులు మాదక ద్రవ్యాలు హెరాయిన్, ఓపియంను అక్రమంగా ఉంచుకొని అమ్ముతున్న నమ్మకమైన సమాచారం మేరకు దాడి చేయగా 08 గ్రాముల హెరాయిన్, 34 గ్రాముల ఓపియం ను స్వాదీనము చేసుకొని బుద్దారాంను అరెస్ట్ చేసి రిమాండుకు పంపించినట్లు తెలిపారు. పరారీలో ఉన్న కోశాల రామ్ ను త్వరలో పట్టుకుని అరెస్ట్ చేయనున్నట్లు ఏఎస్పీ వెల్లడించారు.