మద్యం మత్తులో కత్తిపోట్లు

 సిరా న్యూస్,హైదరాబాద్;
మద్యం మత్తులో తన తోటి వ్యాపారస్థున్ని కత్తితో పొడిచి నసంఘటన కోఠిలోని ఎస్.వి మద్యం షాపులో జరిగింది.ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కోఠి ఎస్.వి వైన్ షాప్ పర్మిట్ రూమ్ లో భద్రతా సిబ్బంది లేకపోవడం వల్లనే ఈ ఘటన జరిగింది. ఎస్.వి వైన్ షాప్ యజమాని నిబంధనలకు వ్యతిరేకంగా రెండంతస్థులలో పర్మిట్ రూమ్ లు ఏర్పాటు చేసి మద్యం వ్యాపారం కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఎస్.వి వైన్ షాప్ లో ఎలాంటి భద్రత చర్యలు లేవని…సీసీ ఫుటేజ్ ఇవ్వాలని పోలీసులు అడగడంతో సీసీ ఫుటేజ్,సీసీ కెమెరాల పనిచేయడం లేదని పోలీసులకు సమాధానం ఇచ్చారని సమాచారం. చిరు వ్యాపారం చేసుకుంటున్న ఇద్దరి మధ్య గొడవ వచ్చి ఒకరు కత్తిపోట్లకు గురయ్యారు. క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *