సిరా న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం;
తాగి పాఠశాలకు వచ్చి పిల్లలను ఇష్టం వచ్చినట్టుగా కొడుతున్నాడని చర్ల మండలం జిపి పల్లి పాఠశాల ఇన్చార్జి హెచ్ఎం కృష్ణను తరగతి గదిలో గ్రామస్తులు నిర్బంధించి తాళం వేసారు. సమస్యల వల్ల పాఠశాలకు తాగి వస్తున్నానని మత్తులో టీచర్ కృష్ణ చెబుతున్నారు. పాఠశాల ఆవరణలోని చెట్ల కొమ్మలు విరిచి ఇష్టం వచ్చినట్టుగా టీచర్ కృష్ణ కొడుతున్నాడని విద్యార్థినులు విలపించారు.
=====