సిరాన్యూస్, ఆదిలాబాద్
డీఎస్పీని కలిసిన కాంగ్రెస్ నాయకులు
ఆదిలాబాద్ డీఎస్పీగా నూతనంగా నియమితులైన ఎల్ .జీవన్ రెడ్డిని సోమవారం జిల్లా కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా డీఎస్పీని శా లువా,పుష్ప గుచ్చంతో సత్కరించారు. అంతకు ముందు ఆదిలాబాద్ లో పని చేసిన అనుభవముండటంతో బాగోగుల గురించి కాసేపు మాట్లాడుకున్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజా రెడ్డి, జైనథ్ జడ్పీటీసీ తుమ్మల అరుంధతి – వెంకట్ రెడ్డి, మాజీ ఎంపీపీ మంచికట్ల ఆశమ్మ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్, వెంకట్ రెడ్డి, బాయిన్ వార్ గంగా రెడ్డి,డేరా కృష్ణ రెడ్డి, ఎం.ఏ షకీల్, రఫీక్, షాకీర్, సమీ ఉల్లా ఖాన్ తదితరులు పాల్గొన్నారు.