సిరా న్యూస్, ఆదిలాబాద్:
మట్కా నిర్వహకులపై పీడీ యాక్ట్
-ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి
+ 6 గురు మట్కా నిర్వహకుల అరెస్ట్
+ రూ.6030 నగదు, 3 సెల్‌ఫోన్‌లు, మట్కా చీటీలు సీజ్
మట్కా నిర్వహకులపై పీడీ యాక్ట్ సైతం నమోదు చేయడానికి వెనకాడబోమని ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి హెచ్చరించారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని పోలీస్ స్టేషన్‌లో సీఐ డి సాయినాథ్, ఎస్సై పురుషోత్తంలతో కలిసి విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని పిప్పర్‌వాడ టోల్‌ప్లాజా వద్ద ఆరుగురు మట్కా నిర్వహకులను అరెస్ట్ చేసామన్నారు. జిల్లా ఎస్పీ గౌస్ ఆలం ఆదేశాల మేరకు మట్కాపై ఉక్కుపాదం మోపనున్నట్లు తెలిపారు. పిప్పర్‌వాడ టోల్‌ప్లాజా సమీపంలో మహారాష్ట్ర వైపు వెళ్తున్న కొయ్యల రమణ, మేకల సత్యనారాయణ, లక్ష్మణ్, జమీర్, ప్రకాష్, అవినాష్ అనే వ్యక్తులను తనిఖీ చేయగా, వారి వద్ద మహారాష్ట్రలోని బోరి–పాటన్‌లో మట్కా నిర్వహిస్తున్న అశోక్ సామ్రాట్‌కు చెందిన పలు మట్కా చీటీలు, రూ. 6030 నగదు, మూడు సెల్‌ఫోన్‌లు లభించడంతో వారిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. మట్కా నిర్వాహకులతో పాటు వారికి సహకరిస్తున్న వారిపై సైతం సస్పెక్ట్ సీట్స్ ఓపెన్ చేయడంతో పాటు పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు.