సిరాన్యూస్,ఆదిలాబాద్
గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం: డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి
* కుర్షిద్‌నగర్ మమతా జిన్నింగ్ మిల్ వద్ద మృతదేహం లభ్యం
ఆదిలాబాద్ పట్టణంలోని కుర్షిద్ నగర్ ప్రాంతంలో మమత జిన్నింగ్ మిల్ వద్ద ప్రదేశంలో రోడ్డు ప్రక్కన గాయాలతో ఒక మహిళ మృతదేహం లభించిందని ఆదిలాబాద్ డీఎస్‌పీఎల్ జీవన్ రెడ్డి తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ వివరాలు వెల్లడించారు.మహిళ దాదాపు 30 సంవత్సరాల వయసు, ఆనవాళ్లు శరీరం ఎరుపు రంగుతో ఉండి గులాబీ రంగు చీర జాకెట్ ధరించి ఉందని తెలియజేశారు. మహిళను ఎక్కడో గాయపరిచి,చంపి సంఘటన స్థలంలో పడేసినట్లు తెలిపారు. మహిళ ముఖంపై, ఒంటిపై గాయాలు ఉండడంతో ఆదిలాబాద్ రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు, దర్యాప్తు జరుగుతున్నట్లు చెప్పారు. ఈ విషయంపై సంబంధికులు, ప్రజలు ఎవరైనా ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి 8712659914, ఆదిలాబాద్ రెండవ పట్టణ సీఐ అశోక్ 8712659920 కు సంప్రదించగలన్నారు. మహిళ మృతదేహం ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో ఉందన్నారు.