సిరా న్యూస్, ఆదిలాబాద్
రూ. 3,15,150 విలువ గల నిషేధిత పొగాకు పట్టివేత: డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి
* మావల పోలీస్ స్టేషన్ లో ముగ్గురి పై కేసు నమోదు
* ఒకరి అరెస్ట్,ఇద్దరి పరారీ
* పొగాకు విక్రయించిన, సరఫరా చేసిన కఠిన చర్యలు
ఆదిలాబాద్ జిల్లా మావలలో రూ.3,15,150 విలువ గల నిషేధిత పొగాకు ఉత్పత్తులను గురువారం పోలీసులు పట్టుకున్నారు. మావల పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి వివరాలు వెల్లడించారు. బుధవారం రాత్రి ఆదర్శనగర్ లోని అపార్ట్ మెంట్ లో ఇల్లు కిరాయికి తీసుకోని నిషేదిత పొగాకు ను ప్రజలకు అమ్మాలనే ఉద్దేశంతో నిలువ ఉంచగా స్వాధీనపర్చుకొని, నిందితున్ని పట్టుకున్నామని తెలిపారు. పట్టుబడిన వారిలో ఏ1)గా ఆదిలాబాద్ రిక్షాకాలనీకి చెందిన షేక్ అఫ్సర్ ను అరెస్ట్ చేశామని తెలిపారు. ఏ2గా అక్రం, ఏ3)గా మన్సూర్ లు పరారీలో ఉన్నట్లు తెలిపారు. నిందితుడు డబ్బు మీద అత్యాశ, పరిస్థితుల ప్రభావం ద్వారా ప్రభుత్వం నిషేదించినందున పొగాకును అమ్మి డబ్బులు సంపాదించాలనే ఉద్దేశం తో ఏ1) షేక్ అఫ్సర్ పొగాకును , ఏ2) అక్రం, ఏ3). మన్సూర్ ల నుండి కొనుగోలు చేసి ప్రజలకు ఎక్కువ ధరకు పొగాకును అమ్ముతూ లాభం పొందుతున్నారు. అందులో బాగంగా ఆదర్శనగర్ లో ఇల్లు కిరాయికి తీసుకోని అందులో నిషేధిత పొగాకును అక్రం ,మన్సూర్ ల నుండి కొనుగోలు చేసి నిల్వ ఉంచారు. మావల సబ్- ఇన్స్పెక్టర్ కు అందిన సమాచారం మేరకు పోలీస్ స్టేషన్ సిబ్బందితో బుధవారం ఏ1) షేక్ అఫ్సర్ యొక్క ఇంటిని తనిఖీ చేయగా నిషేదిత పొగాకు విలువ రూపాయలు 3,15,150/- పట్టుబడిందని, ఈ నిషేధిత పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకుని మావల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు తెలియజేశారు. నిషేదిత పొగాకు ఉత్పత్తులను నిందితుడు ఏ1) షేక్ అఫ్సర్ కు అమ్మిన ఏ2) అక్రం,ఏ3). మన్సూర్ పరారిలో ఉన్నారని తెలిపారు. పొగాకును అక్రమంగా సరఫరా, అమ్మకం చేసేవారిపై కఠిన చర్యలు తప్పవని డిఎస్పి హెచ్చరించారు. ఎటువంటి సమాచారం అయినా జిల్లా ఉన్నతాధికారులకు కానీ, డయల్ 100 ద్వారా కానీ సమాచారాన్ని అందించాలని సూచించారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచబడతాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రూరల్ సీఐ ఫణి ధర్, ఎస్సై విష్ణువర్ధన్, మావల పోలీస్ స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.