సిరాన్యూస్, మావల
సైబర్ నేరాలపై అవగాహన అవసరం: డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి
సైబర్ నేరాల పట్ల ప్రజలు, విద్యార్థులు, యువత పూర్తిగా అవగాహన కలిగి ఉండి, తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లాలోని మావల మండలంలోని గవర్నమెంట్ అగ్రికల్చర్ బీఎస్సీ కాలేజ్, తాంసి మండలంలోని గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లో షీటీం విధులు, సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్బంగా డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు తమ వ్యక్తిగత, బ్యాం కింగ్ వివరాలు అపరిచితులతో పంచుకోవద్దని సూచించారు. ఫోన్‌లలో ఓటీపీ, ఓఎల్‌ఎక్స్, పేటీఎం, గూగుల్ పే, ఫోన్ పే, కేవైసీలను అప్‌డేట్ చేయమని వచ్చే మెసేజ్‌లకు స్పందించకూ డదన్నారు. సైబర్ నేరాలకు గురైనప్పుడు 1930 ట్రోల్‌ఫ్రీ నం బర్‌కు డయల్ చేయాలన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ఏడి, ఆదిలాబాద్ షీ టీమ్ బృందం సభ్యులు సుశీల ,సత్య మోహన్, విద్యార్థినీ విద్యార్థులు ఉన్నారు.