సిరాన్యూస్, కళ్యాణదుర్గం
576 కర్ణాటక మద్యం టెట్రా ప్యాకెట్ల పట్టివేత : డీఎస్పీ రవిబాబు
బోరంపల్లి గ్రామంలో అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యాన్నిఏఎస్ఐ రామాంజనేయులు, పోలీస్ సిబ్బంది పట్టుకొన్నారు. క కళ్యాణదుర్గం రూరల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కళ్యాణదుర్గం డీఎస్‌పీ రవిబాబు వివరాలు వెల్లడించారు. కర్ణాటక నుంచి అక్రమంగా మద్యం తరలిస్తున్నారని మంగళవారం పోలీసులకు సమాచారం వచ్చింది. ఇందులో భాగంగా మండలం బోరంపల్లి గ్రామం వద్ద నుంచి అక్రమంగా ఆటోలో తీసుకెళ్తున్న 576 కర్ణాటక టెట్రా ప్యాకెట్లను కూడేరు మండలం అరవకూరు , అంతరగంగ గ్రామాలకు చెందిన కురుగుంట శివప్రసాద్, తలారి రామాంజనేయు లను అరెస్టు చేశారు. అక్రమంగా కర్ణాటక మద్యం తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అటువంటి వారిని ఉపేక్షించేది లేదన్నారు.