సిరా న్యూస్, కళ్యాణ్ దుర్గం
హింసాత్మక ఘటనలకు పాల్పడితే చర్యలు: డీఎస్పీ బి.శ్రీనివాసులు
* కేంద్ర సాయుధ బలగాలతో ఫ్లాగ్ మార్చ్
హింసాత్మక ఘటనలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కళ్యాణదుర్గం డీఎస్పీ బి.శ్రీనివాసులు హెచ్చరించారు. జిల్లా ఎస్పీ గౌతమిసాలి ఆదేశాలతో కళ్యాణదుర్గం మండలం ఒంటిమిద్దె గ్రామంలో కేంద్ర సాయుధ బలగాలచే ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. గ్రామంలోని ప్రధాన రహదారి ,కాలనీలలో కవాతు కొనసాగింది. అనంతరం గ్రామస్తులతో మాట్లాడారు. అల్లర్లు, గొడవలు జోలికెళ్లి కేసుల్లో ఇరుక్కుపోవద్దని సూచించారు. ముఖ్యంగా యువత సంయనంతో ఉండాలని, కేసుల్లో ఇరుక్కుపోతే భవిష్యత్తు నాశనమవుతుందని తెలియజేశారు. ఈకార్యక్రమంలో సి.ఐ హరినాథ్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.