సిరాన్యూస్, ఆదిలాబాద్
ఈసీ స్కీమ్ ఏఎన్ఎంలను రెగ్యులర్ చేయాలని కలెక్టర్ కు వినతి
ఈసీ స్కీమ్ ఏఎన్ఎంలను రెగ్యులర్ చేయాలని ప్రజారోగ్య , వైద్య ఉద్యోగుల సంఘం 3194 అదిలాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షాకు వినతి పత్రం అందజేశారు. ఈసందర్బంగా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దూలం సత్య నారాయణ రావు, ధారవేని సంతోష్ కుమార్ మాట్లాడారు. 3 నెలల నుండి జీతాలు కూడా రాలేదన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకుడు నల్ల రవీందర్ ,జిల్లా నాయకులు ఆడే సురేష్ ,బొమ్మెత సుభాష్,సచిన్ దేశ్పాండే ఈసీ ఏఎన్ఎం కే. నీలా,కే.సుధారాణి, కే శ్రీవాణి, సంగీత, ప్రియదర్శిని తదితరులు పాల్గొన్నారు.