బాపట్ల జిల్లాబీఆర్ఎస్ కౌన్సిలర్ల లో నిస్తేజం

సిరా న్యూస్,వేములవాడ;
రాజన్న సిరిసిల్ల జిల్లా మరో ఏడాదిలో ముగియనున్న మున్సిపల్ వైస్ చైర్మన్ అవిశ్వాసంతో వేములవాడలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. వ్యక్తిగత కారణాలతో వేములవాడ మున్సిపల్ వైస్ చైర్మన్ మధు రాజేందర్ తన పదవికి రాజీనామా చేయడంతో ఖాళీ ఏర్పడింది. వైస్ చైర్మన్ ఎన్నిక కోసం ఫిబ్రవరి 12 ఎన్నిక నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ ప్రకటించిన కూడా, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఎక్సెఫిషియో మెంబర్ గా ఓటు వేయాల్సి ఉండగా, ఆ సమయంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండంతో వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. అప్పటినుండి ఎలాగైనా కాంగ్రెస్ పార్టీ వైస్ చైర్మన్ పదవిని కైవసం చేసుకోవాలని వేగంగా పావులు కదుపు తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి ఒక్క కౌన్సిలర్ ఉండగా, బి ఆర్ ఎస్, బిజెపి నుండి కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరడం, కాంగ్రెస్ పార్టీ బలం అరుకు చేరింది. కాగా, వైస్ చైర్మన్ ఎన్నిక ను మాజీ మంత్రి కేటీఆర్ పట్టించుకోకపోవడం, జిల్లా అధ్యక్షులు విప్ జారీ చేసి చేతులు దులుపుకోవడంతో, ఆ పార్టీ కౌన్సిలర్ల లో నిరాశ నెలకొంది. వేములవాడ మున్సిపల్ కౌన్సిలర్లు 28 మందిలో బిఅర్ఎస్ 16 మంది, బీజెపీ 06, కాంగ్రెస్ 01.ఇండిపెండెంట్ లు 05 గురు ఉండగా, వైస్ చైర్మన్ పదవి కోసం బి అర్ ఎస్ నుండి మారం కుమార్, కాంగ్రెస్ నుండి బింగి మహేష్ లు పోటీ లో వుండడంతో, మెజార్టీ కౌన్సిలర్లు కాంగ్రెస్ కౌన్సిలర్ మహేష్ వైపే మొగ్గు చూపుతున్నారు. వేములవాడ వైస్ చైర్మన్ పదవిని ఎవరు కైవసం చేసుకుంటారో మార్చి ఏడున తేలనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *