సిరాన్యూస్, కళ్యాణదుర్గం
దురదకుంటలో కర్బూజా పంటపై ఎలుగుబంట్లు దాడి
కళ్యాణదుర్గం మండలం దురదకుంట గ్రామానికి చెందిన వంశి అనే రైతు సాగు చేసిన కర్బూజా పంటపై గురువారం ఎలుగుబంట్లు దాడి చేశాయి. కర్బూజా పంటను పూర్తిగా ధ్వంసం చేశాయి. దీంతో ఆర్థికంగా నష్టపోయిన రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తెలుసుకున్న ఫారెస్ట్ సిబ్బంది మల్లికార్జున నరేష్ దేవా నాయక్ రాత్రిపూట ఎలుగుబంటి కోసం అక్కడే గాలింపు చర్యలు చేపట్టారు.