During the time of Congress, women had a big place : కాంగ్రెస్ హయంలోనే మహిళలకు పెద్దపీట

కాంగ్రెస్ మహళా నేత సునీతా రావు
సిరా న్యూస్,ఖమ్మం;
కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావు మీడియాతో మాట్లడారు. బీజేపీ పార్టీ మహిళలపై వివక్ష చూపిస్తుంది. మహిళా సాధికారిత అని చెప్పి దాన్ని విస్మరించింది. మొన్నటివరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు వ్యతిరేఖంగా పని చేశాయి. దానికోసమే నారి సమ్మేళనం న్యాయ్ యాత్ర చేస్తున్నామని అన్నారు. రాజకీయ, విద్యా వ్యవస్థలో మహిళలకు అన్యాయం జరుగుతుంది. రాహుల్ గాందీ ప్రధాని అయితే మహిళలకు 51 శాతం రిజర్వేషన్ కల్పిస్తారు. డబ్బు పంచి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపొందాలని చూస్తుంది. బీఆర్ఎస్ నాయకులు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. గ్యాస్ పై సబ్సిడీ కోసం మహిళా కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేస్తే వారిపై అక్రమ కేసులు నమోదు చేశారు. రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల్లో మహిళలు అధిక సంఖ్యలో కాంగ్రెస్ కు ఓటు వేస్తారు. నిర్మల సీతారామన్, స్మృతి ఇరానీ, కల్వకుంట్ల కవిత లకు మహిళల పట్ల చిత్తశుద్ధి లేదు. గత 10 ఏళ్లలో రాష్ట్రంలో జరిగిన అవినీతి గురించి కమిషన్ వేస్తాం, అది మేము చేసే పని కాదు అధికారులు చేస్తున్న పని. దొరగా బతికిన కేసిఆర్ ఎందుకు దొంగలా పారిపోతున్నారని ప్రశ్నించారు.
హరీష్ రావు సీఎం అవ్వాలని 5 వేల కోట్లు వెనుక వేసుకున్నారు. మహిళల రేప్ లు, కిడ్నాప్ లు చేసేది బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాలే. బీజేపీ, బీఆర్ఎస్ పాలనలో లా అండ్ ఆర్డర్ అదుపుతప్పింది. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే ఎందుకు అంటున్నాం అంటే పార్లమెంట్ లో బీజేపీ ప్రవేశ పెట్టిన ప్రతి బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు తెలిపేది. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగుర వేస్తాం. సునీతా లక్ష్మారెడ్డి మగవారికి సీట్ లు దొరకడం లేదని మాట్లాడటం సరికాదు. నిర్మలా సీతారామన్ ఉల్లి ధరలు పెరిగాయని అడిగితే ఉల్లిపాయలు తినొద్దు అని మాట్లాడుతున్నారు. మా పిల్లలందరికీ ఉద్యోగాలు రావాలని నోటిఫికేషన్ ఇస్తున్నాం. నీళ్ళు, నిధులు, నియామకాలు అన్నారు మేడిగడ్డ ప్రాజెక్ట్ లో ఎంత పెద్ద తోర్రలు వచ్చాయో మనం చూశాం. ప్రధానిగా అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో ప్రధాని చెప్పాలి. పేద ప్రజలకు పెద్ద పీట వేసినందుకు గానూ ప్రజలు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ వెంట ఉన్నారు. రాబోయే కాలంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు అనుగుణంగా పని చేస్తామని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *