సిరా న్యూస్, బేల
మోదీ ప్రభుత్వం తోనే గ్రామాల అభివృద్ధి
* బీజేపీ మండల అధ్యక్షుడు దత్తా నిక్కం
* సీసీ రోడ్డు నిర్మాణాకి భూమి పూజ
గ్రామాల్లో మోదీ ప్రభుత్వం తోనే అభివృద్ధి సాధ్యమవుతుందని బీజేపీ మండల అధ్యక్షుడు దత్తా నిక్కం అన్నారు. ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని వరూర్ గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద రూ.3 లక్షలతో చేపట్టనున్న సీసీ రహదారి పనులకు శనివారం బీజేపీ మండల అధ్యక్షుడు దత్తా నిక్కం భాజపా నాయకులతో కలిసి భూమి పూజ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…ఆప్ కీ బార్ మోడీ సర్కార్ నినాదంతో మళ్లీ మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వహణ సదస్సు మోరేశ్వర్ జీ, జనరల్ సెక్రటరీ ఠాక్రే సందీప్, మురళీధర్ ఠాక్రే ఢోపటాల సర్పంచ్ రాకేష్ , గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు