అధికారులకు మంత్రి అనిత ఆదేశం
సిరా న్యూస్,అమరావతి;
బంగాళాఖాతంలో అల్పపీడనం నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమయింది. సీఎం చంద్రబాబు ఆదేశాలు మేరకు అధికారులను విపత్తుల నిర్వాహణ శాఖ మంత్రి అనిత అప్రమత్తం చేసారు. అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఏలూరు,అనకాపల్లి జిల్లాల కలెక్టర్లతో మంత్రి మాట్లాడారు. ఆయా జిల్లాలో వర్షాలపై తీసుకుటుంటున్న చర్యలపై ఆరా తీసారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి జిల్లాలో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసామని వెల్లడించారు.