సిరా న్యూస్ ,బేల
గ్రామాల్లో పరిశుభ్రత పాటించాలి
*స్పెషల్ ఆఫీసర్ ఈడీ శంకర్
*సాంగిడీ గ్రామాన్ని సందర్శన
గ్రామాల్లో పరిశుభ్రత పాటించాలని స్పెషల్ ఆఫీసర్ ఈడీ శంకర్ అన్నారు. గురువారం ఆయన సాంగిడీ గ్రామాన్ని సందర్శించారు. అనంతరం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో ఎప్పటికప్పుడు పారిశుద్ధ్యం పాటించాలన్నారు. నీటి కొరత, పల్లె ప్రగతి అలాగే పల్లె ప్రకృతి ఉపాధి హామీ హరితహరం మొక్కలను సంరక్షణ చేయాలని చెప్పారు. ఈ రానున్న వేసవికాలంలో విద్యుత్ సమస్య పరిష్కరించాలన్నారు .ప్రజా పాలన అవసరాల నిమిత్తం రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ సుమన్ బాయ్ , ఎంపీటీసీ రాకేష్ పారట్కర్ బాలచందర్ , గ్రామ కార్యదర్శి గౌతమ్, అంగన్వాడీ టీచర్స్ ఆశ వర్కర్లు, గ్రామ సిబ్బంది ఠాక్రే విట్టల్ గెడ్డం విటల్ తదితరులు పాల్గొన్నారు.