సిరా న్యూస్,ఆదిలాబాద్
మీసేవ కేంద్రాన్ని తనిఖీ చేసిన ఈడీఎం రవి
జీరో ట్రాన్సాక్షన్ చేసే మీసేవ సెంటర్ల పైన తగిన చర్యలు
జీరో ట్రాన్సాక్షన్ చేసే మీసేవ సెంటర్ల పైన తగిన చర్యలు తీసుకుంటామని ఈడీఎం రవి అన్నారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని తాంసి బస్టాండ్ లో గల బట్టు రాజేందర్ మీసేవ సెంటర్ ను ఆయన తనిఖీ చేశారు. మీసేవ వీఎల్ఈలకు సాంక్షన్ అలాట్ చేసిన స్థలంలోనే మీసేవ నడిపియాలని సూచించారు. అదేవిధంగా స్టేషనరీ రిజిస్టరు కచ్చితంగా అప్డేట్ గా ఉంచాలని తెలిపారు.రాష్ట్ర ఆదేశాల మేరకు మీసేవ ఆపరేటర్ ఇచ్చేటటువంటి రిసిప్ట్ పైన టీఎస్టీఎస్ కి బదులుగా టీజీటీఎస్ స్టాంపు చేసుకొని రిసిప్ట్ పైన చూసుకొని స్టాంపు వేసి సిటిజెన్స్ కి ఇవ్వాల్సిందిగా చెప్పారు. మీసేవ అందిస్తున్న ఆపరేటర్లు సర్వీసులు ఇవ్వకుండా జీరో ట్రాన్సాక్షన్స్ అయి ఉంటే వాటిపైన రాష్ట్ర ఈఎస్డి ఆఫీస్ ఆదేశాల మేరకు తగిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.