ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల అక్రమ అడ్మిషన్లు ఆపాలి
ఫీజుల దోపిడీని అరికట్టాలి
అక్షరాలపై లక్షల వ్యాపారం చేస్తున్న చైనా విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి
అనుమతులు లేకుండా నడుపుతున్న కార్పొరేట్ విద్యాసంస్థలను సీజ్ చేయాలి
పాఠశాల పేరుతో ముద్రించిన పుస్తకాలు ఒక తరగతికి 12,నుంచి15 వేల రూపాయల వసూలు చేస్తున్న కార్పొరేట్ విద్యాసంస్థలు
ఇప్పటికే అడ్మిషన్లు క్లోజ్ అని బోర్డులు వేసిన కార్పొరేట్ విద్యాసంస్థలు
ఇంటర్నేషనల్ స్కూల్ పేరుతో లక్షల రూపాయలు ఫీజుల దోపిడీ
విద్యా సంవత్సరం ప్రారంభం కాకమునుపే ప్రైవేటు కార్పొరేట్ విద్యాసంస్థల యాజమాన్యం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా అడ్మిషన్లు నెరవేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని జిఆర్ఎస్ వై ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డిఎం ఓబులేసు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ సిద్దిక్ డిమాండ్ చేశారు
కడపలోని జి ఆర్ ఎస్ వై ఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా కార్పొరేట్ విద్యాసంస్థలు ముందస్తు అడ్మిషన్లు చేస్తున్న వాటిపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు జిల్లాలో నారాయణ చైతన్య మరికొన్ని కార్పొరేట్ మరియు ఇంటర్నేషనల్ విద్యాసంస్థలు విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే విద్యార్థుల తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి లక్షల రూపంలో ఫీజులు వసూలు చేస్తూ అడ్మిషన్లు చేస్తున్నారని పేర్కొన్నారు. అదేవిధంగా జిల్లాలో ఒకటి రెండు బ్రాంచ్లకు పర్మిషన్లు తెచ్చుకొని ఏడు ఎనిమిది బ్రాంచ్ లు నడుపుతున్నారని తెలియజేశారు.. ఒక తరగతికి పాఠశాల పేరుతో ముద్రించిన పుస్తకాలను 10 వేల నుంచి 15 వేల రూపాయల వరకు విద్యార్థుల తల్లిదండ్రులకు పాఠశాల యాజమాన్యులు అమ్ముతున్నారని మండిపడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా పాఠశాల పేరుతో ముద్రించిన పుస్తకాలు అమ్మకూడదని ఆ నిబంధనలు ఉన్న ఆ నిబంధనలను కార్పొరేట్ విద్యాసంస్థలు తుంగలో తొక్కుతున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు వసూలు చేయకుండా నిబంధనలకు విరుద్ధంగా సి బ్యాచ్ ఐకాన్ ఐపీఎల్ సెమీ రెసిడెన్షియల్ ఒలంపియాడు టెక్నో ఎంపీఎల్లో ఇలా రకరకాల పేర్లు ఏర్పాటు చేసుకొని ఒక్కో గ్రూప్ కి ఒక్కొక్క ఫీజు చొప్పున విద్యార్థుల తల్లిదండ్రుల నుండి లక్షల రూపాయలు దోపిడీ చేస్తున్నారని పేర్కొన్నారు.. తక్షణమే జిల్లాలో ఉన్న కార్పొరేట్ విద్యాసంస్థలను ఒక అధికారిని నియమించి విద్యాసంస్థల అన్ని సందర్శించి ముందస్తు అడ్మిషన్లు చేస్తున్న వాటిపైన అలాగే అనుమతులు లేకుండా నడుపుతున్న విద్యాసంస్థల పైన పాఠశాల పేరుతో ముద్రించిన పుస్తకాలను వేళ్ల రూపాయల లో వసూలు చేస్తున్న విద్యాసంస్థల పైన అనుమతులు లేకుండా ఇంటర్నేషనల్ బ్రాంచ్ ఏర్పాటుచేసుకొని నడుపుతున్న విద్యాసంస్థల పైన తక్షణమే చర్యలు తీసుకొని విద్యార్థుల తల్లితండ్రులను ఫీజుల దోపిడీ నుంచి కాపాడాలని విజ్ఞప్తి చేశారు లేని పక్షంలో జి ఆర్ యస్ వై ఫ్ ఆధ్వర్యంలో విద్యాసంస్థల ఎదుట ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు