కోదాడ మాజీ ఎంపీపీ చింత కవిత రాధారెడ్డి
సిరా న్యూస్,సూర్యాపేట;
పార్టీ సీనియర్ మహిళా శాసనసభ్యులు సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డిల పైన ముఖ్యమంత్రి చేసిన నీచమైన వ్యాఖ్యలకు నిరసనగా బిఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు పిలుపుమేరకు కోదాడ మాజీ శాసనసభ్యులు, నియోజకవర్గ ఇన్చార్జ్ బొల్లం మల్లయ్య యాదవ్ గారి ఆదేశానుసారం కోదాడ పట్టణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్నం చేసిన కోదాడ నియోజకవర్గ భారత రాష్ట్ర సమితి నాయకులు, కార్యకర్తలు. ఈ సందర్భంగా కోదాడ మాజీ ఎంపీపీ చింత కవిత రాధారెడ్డి మాట్లాడుతూ,తెలంగాణ సంస్కృతిలో ఆడబిడ్డలకు ప్రత్యేక గౌరవం, స్థానం ఉందన్న కనీస సొయి లేకుండా ఆడబిడ్డలను నమ్ముకుంటే ఆగమైతావంటూ, ఆడబిడ్డలను నమ్ముకుంటే ముంచుతారంటూ, జీవితం బస్టాండ్ పాలవుతుందంటూ ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా తన స్థాయి మరిచి చేసిన నీచమైన వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందని అమె అన్నారు. సుదీర్ఘ కాలం పాటు ప్రజల మన్ననలు అందుకుంటూ కార్యకర్తల ఆశీర్వాదంతో, అనేక త్యాగాలతో ప్రజలకు సేవ చేస్తున్న ఇద్దరు సీనియర్ మహిళ సభ్యులపైన, అహంకారంతో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ఆడబిడ్డలందరికీ మనసులను నోప్పించాయని, జీవితంలో ఎదగాలనుకుంటున్న ప్రతి ఒక్క మహిళకు, ఆడబిడ్డకు ఈ వ్యాఖ్యలు అవమానకరమని అమె అన్నారు. అధికారం అహంకారంతో రేవంత్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలను తెలంగాణ సమాజమంతా ముక్తకంఠంతో ఖండించాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు. రేవంత్ రెడ్డి వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ఆడబిడ్డలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భారత రాష్ట్ర సమితి మహిళా నాయకురాలు పిట్టల భాగ్యమ్మ, మాజీ పిఎసిఎస్ చైర్మన్ ముత్తవరపు రమేష్, మాజీ ఎంపిటిసి గంట శ్రీనివాస్, నాయకులు విష్ణువర్ధన్ రావు, పాపారావు, యువత అధ్యక్షులు వెంకట్ రెడ్డి, సుంకర అభి నాయుడు, బిఆర్ఎస్ నాయకులు కాసాని మల్లయ్య గౌడ్, చలి కంటి వెంకట్, గోపి, రాహుల్, టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.