మైనర్ బాలికపైవృద్దుడు అత్యాచారం

సిరా న్యూస్,మేడ్చల్;
ఉప్పల్లో 16ఏళ్ల బాలికపై ఓ వృద్ధుడు అత్యాచారం జరిపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈనెల 3న ఉప్పల్ బస్ స్టాప్ లోబాలిక బస్సు ఎక్కేందుకు ఎదురుచూస్తుంది. తెలిసిన వాళ్ళలాగా ఇంటికి తీసుకెళ్తానంటూ మాయమాటలు చెప్పి సాదిక్ ఆ బాలికను తీసుకెళ్లాడు. అక్కడి నుంచి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం జరిపాడు. తరువాత ఆ బాలికను అక్కడే వదిలేసి పారిపోయాడు. బాలిక ఇంటికి ఆలస్యంగా రావడం, ఇంట్లో మౌనంగా ఉండటంతో కుటుంబ సభ్యులకు అనుమానం కలిగింది. బాలికను మందలించడంతో విషయం తల్లికి చెప్పింది. అత్యాచారం జరిగినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసారు. సీసీ కెమెరాల ఆధారంగా అత్యాచారానికి పాల్పడిన 60 ఏళ్ల వృద్ధుడిని పోలీసులు గుర్తించి అరెస్టు చేసారు. పాతబస్తీకి చెందిన షేక్ సాదక్(60) ఉప్పల్ బస్టాండు ప్రాంతంలోని ఓ కట్టెల మిషన్లో పనిచేస్తున్నాడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *