సిరాన్యూస్, చిగురుమామిడి
అమల్లోకి ఎన్నికల కోడ్
2024 లోకసభ పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఎన్నికల కోడ్ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. చిగురుమామిడి మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో అధికారులు రాజకీయ పార్టీలకు సంబంధించిన వాల్ పోస్టర్స్, తోరణాలు,వాల్ రైటింగ్స్, పార్టీ జెండా గద్దెలకు రంగులు వేయడం చేస్తున్నారు.చిగురుమామిడి మండలంలోని బొమ్మనపల్లి కార్యదర్శి రమణారెడ్డి గ్రామంలో రాజకీయ పార్టీల వాల్ పోస్టర్లను తొలగించారు.ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘించినట్లయితే కఠిన చర్యలు తప్పవని అధికారులు తెలిపారు.