సిరాన్యూస్,కుందుర్పి
ఎన్నికల కోడ్ అమల్లో…
* చర్యలు చేపడుతున్న అధికారులు
మండల కేంద్రమైన కుందుర్పి గ్రామంలో మండల వివిధ గ్రామాల్లో ఎన్నికల కోడ్ అమలు దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో సోమవారం కుందుర్పి గ్రామంలో రాజకీయాల పార్టీలతో సంబంధించిన వాల్ పోస్టర్లు పూర్తిగా తొలగించారు. అదేవిధంగా విగ్రహాలకు మొఖం కనిపించకుండా క్రింది నుండి పైన వరకు ముసుగును ధరించారు. అలాగే బాబు చంద్రబాబు టిడిపి కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అభ్యర్థి సురేంద్రబాబు వాల్ పోస్టులను తొలగించారు. ఈ కార్యక్రమం లో రెవెన్యూ సిబ్బందికుందుర్పి వీఆర్వో అజిత్ కుమార్ తలారి ఓబులేష్ రెవెన్యూ సహాయకులు పాల్గొన్నారు.