సిరా న్యూస్,యాదాద్రి భువనగిరి;
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఐ.రాణి కుముదిని దేవి శనివారం యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఆమెకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆమె స్వామి వారి ప్రత్యేక పూజల్లో పాల్గొనగా.. పండితులు వేదమంత్రోచ్ఛారణల మధ్య స్వామి వారి ఆశీస్సులు అందజేశారు. స్వామి వారి తీర్థ ప్రసాదాలను ఈవో భాస్కర్ రావు అందించారు. యాదాద్రి దేవాలయం నిర్మాణం చూసి ఆమె సంతోషం వ్యక్తం చేశారు.