సిరాన్యూస్, ఖానాపూర్
సుర్జాపూర్‌లో విద్యుద్ఘాతంతో ఎద్దు మృతి
విద్యుద్ఘాతంతో ఎద్దు మృతి చెందిన సంఘటన నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని సుర్జాపూర్ గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. సుర్జాపూర్ గ్రామానికి చెందిన షేక్ చాంద్ అనే రైతు తన పంట చెనులోకి ఉదయం జోడు ఎద్దులను తీసుకపోగా గురు వారం రాత్రి ఈదురు గాలికి 11 కె.వి విద్యుత్ తీగల పై చెట్టు విరిగిపడ్డంతో విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. దీంతో తెగిపడ్డ విద్యుత్ తీగలను చూడకుండా శుక్రవారం జోడి ఎద్దులు తీసుకొని వెళ్ళాడు. దీంతో తీగలు తగలడంతో ఒక్క ఎద్దు మృతి చెందింది. అక్కడే ఉన్న రైతు గమనించి విద్యుత్ తీగలను కట్టె తో దూరం కొట్టడంతో జోడి ఎద్దులలో ఒక ఎద్దు ప్రమాదం తప్పింది. మృతి చెందిన ఎద్దు నలభై వేలు రూపాయల విలువ ఉంటుందని రైతు తెలిపారు. ఈవిషయం తెలుసుకున్న విద్యుత్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు.ఈసందర్భంగా విద్యుత్ ఏ ఈ యశ్వంత్ రావు, లైన్‌మెన్ అంకం నరేష్ బాధిత రైతుకు ప్రభుత్వం నష్టపరిహారం అందేలా చూస్తామని తెలిపారు.