సిరాన్యూస్, బోథ్
విద్యుద్ఘాతంతో యువకుడు మృతి
* కౌట(బి)లో విషాదం
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని కౌట(బి) గ్రామానికి చెందిన మాకునూరి రత్నాకర్ (24) యువకుడు ఆదిలాబాద్ లో విద్యుద్ఘాతంతో మృతి చెందాడు. కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం… మాకునూరి రత్నాకర్ ఆదిలాబాద్లో తన అత్తగారి ఇంటికి వెళ్లి అక్కడే ఉంటూ మేస్త్రీగా పనులు చేసుకుంటున్నాడు. అయితే మేస్త్రి పని చేస్తుండగా విద్యుత్ షాక్ గురై మృతి చెందాడు. అందరితో కలుపుగోలుగా ఉండే రత్నాకర్ మృతి చెందడంతో స్వగ్రామమైన కౌట(బి) లో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతునికి భార్య ఉంది.