సిరా న్యూస్,కుత్బుల్లాపూర్;
సూరారం పోలీస్ స్టేషన్ పరిధి సూరారం చౌరస్తా లో గల ఆదిత్య మెడికల్ షాప్ ముందు ఎలక్ట్రికల్ బైక్ లో మంటలు చెలరేగాయి. దాంతో ఎలెక్ట్రిక్ వాహనం పూర్తిగా దగ్దమయింది. పక్కనే గల మెడికల్ షాప్ కు కుడా మంటలు అంటుకోవడంతో షాపు ముందు భాగం పాక్షికంగా దగ్దమయింది. ఈ నేపధ్యంలో రోడ్డుపై ట్రాఫిరక్ స్థంభించింది. వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఫైర్ సిబ్బం్ది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసారు. ఎలక్ట్రిక్ వాహనం బ్యాటరీ ఛార్జ్ చేస్తుండగా మంటలు వచ్చాయి.