సిరా న్యూస్,విశాఖపట్నం;
విశాఖ ఇండస్ ఆస్పత్రిలో జరిగిన అగ్ని ప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడమే కారణమని విచారణ కమిటీ నిర్ధారణకు వచ్చింది. ఆర్డీవో హుస్సేన్ సాహెబ్ నేతృత్వంలో కలెక్టర్ ఏర్పాటుచేసిన కమిటీ ఆస్పత్రిని సందర్శించింది. ఈ సందర్భంగా అగ్ని ప్రమాదం జరిగిన రెండవ అంతస్థులో ఆపరేషర్ థియేటర్, విద్యుత్ సరఫరా అయ్యే బోర్డు, ఐసీయూ, ఇతర గదులు, భవనంలో మిగిలిన అంతస్థులను పరిశీలించింది. విద్యుత్ సర ఫరా చేసే స్విచ్ బోర్డు నుంచి షార్ట్ సర్క్యూట్ కావడంతో అగ్ని ప్రమాదం జరిగిందని కమిటీ తేల్చింది. నైట్రస్ ఆక్సైడ్ లీక్ కావడంతో ప్రమాదం చోటుచేసుకున్నట్టు రెవెన్యూ అధికారి వెల్లడించారు. అయితే ఆర్డీవో నేతృత్వంలో నియమించిన కమిటీ ఆస్పత్రిని సందర్శించి ఆపరేషన్ థియేటర్లో అగ్ని ప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణమని గుర్తించింది. ఈ మేరకు కమిటీ తన నివేదికను నేడు కలెక్టర్కు అందజేయనుంది.