సిరా న్యూస్,ప్రత్తిపాడు;
ఏలేరు ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ఏలేరుకు వరద ఉధృతి పెరుగుతోంది. ఏలేరు ప్రాజెక్ట్ ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న నీటితో ఏలేశ్వరం లోని ఏలేరు ప్రాజెక్టు నిల్వలు గరిష్ఠ స్థాయికి చేరుకుంటున్నాయి. ఏలేరు పరివా హక ప్రాంతాల నుంచి 5 వేల టిఎంసి వరద నీరు వస్తోంది. ఈ క్రమంలో రెండు గేట్లు ఎత్తి దిగువకు 5,350 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.ప్రాజెక్ట్ పూర్తి నిల్వ సామర్థ్యం 86.56 మీటర్లు(24.11టీఎంసీలు). ప్రస్తుతం 85.64 మీటర్ల స్థాయిలో 22.24 టీఎంసీల కు చేరుకుంది.