సిరా న్యూస్,కామారెడ్డి;
ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ పీఠం ప్రస్తుతం అవిశ్వాసానికి సిద్ధమైంది… మొదటిసారి మున్సిపల్ చైర్మన్ గా పదవిబాధ్యతలు స్వీకరించిన కుడుముల సత్యనారాయణ ఐదేళ్ల పదవీకాలం పూర్తికాకముందే అవిశ్వాసానికి రంగం సిద్ధమైంది. మరికాసేపట్లో అవిశ్వాస సమావేశానికి అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. టిఆర్ఎస్ పార్టీ నుంచి ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే జజాల సురేందర్ ఆశీర్వాదంతో చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన కుడుముల సత్యనారాయణ ఇటీవల కాలంలో ఆ పార్టీని వీడి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరగానే మిగతా కౌన్సిలర్లు చైర్మన్ పై అవిశ్వాసానికి అవకాశం కల్పించాలని కోరుతూ గత నెల 24న జిల్లా కలెక్టర్ జితిష్ పాటిల్ ను కలిసి అవిశ్వాసం నోటీసులు అందజేశారు. దీంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈనెల 18వ తారీఖున మున్సిపల్ చైర్మన్ పై విశ్వాసం పెట్టేందుకు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఇప్పటికే చైర్మన్ పదవిని ఆశిస్తున్న ఓ నాయకుడు క్యాంపు ఏర్పాటు చేసారు. ఈ క్యాంపుకు తరలిన 11 మంది కౌన్సిలర్లు నేడు నిర్వహించే సమావేశానికి నేరుగా చేరుకొనున్నారు. చైర్మన్ కుడుముల సత్యనారాయణ పై మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్, కౌన్సిలర్లు గుర్రుగా ఉండడంతో ఈ అవిశ్వాసం నెగ్గడం ఖాయమని పలువురు భావిస్తున్నారు. కాగా ప్రస్తుత ఎమ్మెల్యే మదన్మోహన్ అండతో ఈ అవిశ్వాసాన్ని వీగేలా కుడుముల సత్యనారాయణ ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా హైకోర్టు కి మున్సిపల్ చైర్మన్ వెళ్లిన లాభం లేకుండా పోయింది. అవిశ్వాసాన్ని వాయిదా వేయాలని వేసిన పిటిషన్ ని కోర్టు తిరస్కరించింది. అయితే వివరాలు తదుపరి తీర్పు వరకు వెల్లడించారాధాని తీర్పు ఇచ్చింది.* కాగా ఈ అవిశ్వాసం నెగ్గుతుందా వీగుతుందా అని వివిధ రాజకీయ పార్టీలతో పాటు మున్సిపల్ పరిధిలోని ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.