సిరాన్యూస్, ఖానాపూర్ టౌన్
ఘనంగా ఎల్లమ్మ తల్లి వార్షికోత్సవం
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని ఉత్తరవాహిని గోదావరి నది తీరాన కొలువైన శ్రీ రేణుక మాత ఎల్లమ్మ తల్లి అష్టమ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. 8 రోజుల పాటు జరగనున్న ఈ ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఆలయము లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి విగ్రహము ను శ్రీరామ్ నగర్ కాలనీ లో ఊరేగింపు నిర్వహించారు.