ముగిసిన ఆఫ్ క్యాంపస్ ప్లేస్మెంట్ జెన్ ప్యాక్ డ్రైవ్

సిరా న్యూస్,పెద్దపల్లి;
: ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాల ఆఫ్ క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్ లో హెచ్ ఆర్ ఫైనల్ రౌండ్ కి అర్హత పొందిన 21 విద్యార్థులకు నియామక పత్రాలు ట్రినిటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వ్యవస్థాపకులు దాసరి మనోహర్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. స్థానిక ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాలలో టాస్క్ ఆధ్వర్యంలో సాయంత్రం 5 గంటల వరకు కొనసాగిన ఉద్యోగ ప్రక్రియ బహుళ జాతీయ కంపెనీ జెన్ ప్యాక్ ద్వారా ఆఫ్ క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్ లో 21 మంది విద్యార్థులకు పైగా ఉద్యోగాలు పొందారు. ఈ యొక్క ప్రక్రియలో బహుళ జాతీయ కంపెనీలు జెన్పాక్ట్, కంపెనీ పాల్గొని ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది, ఉద్యోగం పొందిన విద్యార్థులకు ట్రినిటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వ్యవస్థాపకులు దాసరి మనోహర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై వారి చేతుల మీదుగా ఆ కంపెనీ అర్హత పత్రాలు ఉద్యోగం పొందిన విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ కళాశాలపై నమ్మకం ఉంచి తమ యొక్క పిల్లలని నమ్మకంతో ఇంజనీరింగ్ చేర్పించి నందుకు వారికి బహుమతిగా బీటెక్, ఎంబీఏ ఉత్తరులైన 2021, 22 & 2023, 24 అకడమిక్ విద్యార్థులు ప్రతి ఒక్క విద్యార్థికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఒక దృఢ సంకల్పంతో ఈ యొక్క మెగా ఆన్ క్యాంపస్ రిక్రూట్మెంట్ నిర్వహించామని, ప్రతి విద్యార్థి ఉద్యోగ అవకాశం పొందే విధంగా తమ యొక్క కళాశాల ఆధ్వర్యంలో టాస్క్ బృందం చర్యలు తీసుకుంటుందని ఉద్యోగలు పొందిన విద్యార్థులను నియామక పత్రాలు అందజేసి అభినందించారు. ప్రతి ఒక విద్యార్థి ఉద్యోగంలో చేరి ఎక్స్పీరియన్స్ పొంది ఉన్నతమైన కంపెనీలకు ఉద్యోగ అవకాశాలు పొందడం కొరకు ఈ యొక్క ఉద్యోగం పునాదిగా నిలుస్తుందని దీనిని ప్రతి ఒక్క విద్యార్థి సద్వినియోగం చేసుకొని ఉద్యోగంలో చేరాలని తద్వారా తమ యొక్క కళాశాలకు మరియు తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతలు పొందడానికి ఆవశ్యకత ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జెన్పాక్ట్ సౌత్ ఇండియా మేనేజర్ టాస్కర్ రీజినల్ కోఆర్డినేటర్ గంగా ప్రసాద్ అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్. అశోక్ కుమార్, ప్రిన్సిపల్ డాక్టర్ ఎం గణేష్, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ డాక్టర్ ఆరిఫ్, హెచ్ ఓ డి లు డాక్టర్ నటరాజన్, రాజిరెడ్డి,స్వాతి, ప్రభాకర్, రామ్మోహన్, టాస్క్ కో ఆర్డినేటర్స్ డాక్టర్ కౌశల్య, మధు, శేఖర్, శ్రీలత, సాయి, శ్రావణి, సన, రిక్రూట్మెంట్ రిప్రజెంటేటివ్ లు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *