సిరా న్యూస్, జైనథ్
12 క్వింటాళ్ల జొన్న పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి
* కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు ఏనుగు రాకేష్ రెడ్డి
ప్రభుత్వం జొన్న పంట 8క్వింటాళ్ల 85కిలోల ను 12 క్వింటాళ్లకు పెంచి కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రకటన చేసిన ఇప్పటి వరకు అమలు చేయడం లేదని కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు ఏనుగు రాకేష్ రెడ్డి అన్నారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దాదాపు మూడు రోజులు అయితున్న ప్రభుత్వం అమలు చేయడం లేదన్నారు. ఈ 12క్వింటాళ్ల కొనుగోలు ను తక్షణమే అమలు చేయాలని జొన్న రైతుల తరుపున డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిడం రాకేష్, పోచన్న, సురేష్ రెడ్డి, అశోక్, వికాస్, వినోద్, తరుణ్‌లు పాల్గొన్నారు.