సిరా న్యూస్,హైదరాబాద్;
తెలంగాణ బిజెపికి కాంగ్రెస్ కల్చర్ వచ్చిందా? కాంగ్రెస్ పార్టీ సంప్రదాయాన్ని తెలంగాణ బిజెపి పునికి పుచ్చుకుంటుందా? మూడు ఫిర్యాదులు…. ఆరు లీకులతో పార్టీ ముందుకెళ్తుందా? ముఖ్య నేతలు ఒకరి పైన ఒకరు జాతీయ నాయకత్వానికి ఫిర్యాదుల పరంపరను కొనసాగిస్తున్నారా? ఇంతకీ కమలం పార్టీలో నెలకొన్న కల్లోలం ఏంటి? పార్టీ వర్గాల్లో ఎలాంటి చర్చ జరుగుతుంది? వాచ్ థిస్ స్టోరీ.
తెలంగాణ కమలం లో కల్లోలం నెలకొంది… ఆ పార్టీ లో కాంగ్రెస్ కల్చర్ వచ్చిందని టాక్ వినిపిస్తుంది …కౌంటర్ లు ప్రతి కౌంటర్ లు ఇచ్చుకుంటున్నారు బీజేపీ నేతలు…ఒకరి పైన ఒకరు లీక్ లు ఇచ్చుకుంటున్నారు అట… హై కమాండ్ కు పిర్యాదులు కూడా ఇచ్చుకుంటున్నారు అట… బిజెపి ముఖ్య నేతలో ఏ ఇద్దరు నేతలు కూడా కలిసి లేరట… ఎవరికి వారే యమునా తీరులాగా వ్యవహరిస్తున్నారని పార్టీ వర్గాలు చర్చ జరుగుతుంది… పార్టీలో ఎవరికి వారే తమ తమ గ్రాఫ్ నీ పెంచుకోవాలనీ ఎవరి గ్రూపులను వారు ప్రోత్సహిస్తున్నారట… నేనే మంచి నాయకుడిని అంటూ ఎవరికి వాళ్లు మంచి ముద్ర వేసుకోవాలనే తపన పడుతున్నారట… దీంతో నేతల మధ్య విభేదాలు గ్యాప్ పెరుగుతూ వస్తుందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది.గత కొంత కాలంగా అంతర్గత లొల్లి నడుస్తుంది… నేతల మధ్య సమన్వయం లేక పోవడం తో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందడానికి కారణం అనే టాక్ ఉంది… అప్పట్లో పార్టీ లోని ప్రముఖ నేతలు సోషల్ మీడియా వేదిక గా విమర్శలు చేసుకున్నారు..సీట్ల కేటాయింపులో తమ పంతమే నెగ్గాలంటే తమ పంతమే నెగ్గాలనే విధంగా వ్యవహరించారు… పార్లమెంట్ ఎన్నికల సమయం లో ఎవరి పనిలో వారు ఉండడం తో లొల్లి పెద్దగా బయట పడలేదు… ఎన్నికల సమయం లో నేనే గెలవాలి వాళ్ళు ఓడిపోవాలనీ అనుకున్నారు అట… కడుపులో కత్తులు పెట్టుకొని పైకి మాత్రం తీయగా ఉంటున్నారని పార్టీ లో టాక్ వినిపించింది.
ఇపుడు కూడా అదే కొనసాగుతుంది అట… పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు విషయం లో కూడా పార్టీ నేతల్లో ఉన్న గ్యాబ్ మరో సారి బయట పడింది .. నేతలు రోడ్డెక్కారు… కొంటర్ లు ప్రతి కౌంటర్ లు ఇచ్చుకుంటున్నారు… కేంద్రమంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేల సన్మాన కార్యక్రమానికి ముందు ఒక ఎంపి లీక్ లు ఇచ్చారు అట.,. కేవలము వాళ్ళే గెలిచారా మేము గెలవలేద అని ప్రచారం చేయించాడు అట… ఏది జరిగినా టక్కున హై కమాండ్ కు పంపిస్తున్నారు అట., పిర్యాదులు చేసుకుంటున్నారు అట… కొందరు నేతలు కావాలని మరి కొందరి నేతలను ఉద్దేశించి వారికి అధ్యక్ష పదవి ఇవ్వద్దంటూ ఇన్‌డైరెక్టుగా మాట్లాడుతున్నారట…. పార్టీ అధ్యక్ష పదవి పాత నేతలకే రావాలని కొందరు ముఖ్య నేతలు భావిస్తుంటే… మరికొందరేమో తమకే రావాలనీ కోరుకుంటున్నారట…. లేనిపక్షంలో తమకు అనుకూలంగా ఉన్న నేతకు రావాలని భావిస్తున్నారట.
వాయిస్
బిజెపి లో నెలకొన్న పరిస్థితి నీ చూస్తూ ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అట.. మా పార్టీ లో కూడా కాంగ్రెస్ కల్చర్ వచ్చిందని అనుకుంటూన్నారు అట… ఇప్పుడు కాంగ్రెస్ లో కొంచెం కాంప్రమైజ్ అవుతున్నారు కానీ మా పార్టీ లో కత్తులు దూసుకుంటున్నారని ఇది మంచిది కాదని అంటున్నారట…
గతం లో పార్టీ లో ఏదైనా జరిగితే పైకి మాత్రం అందరూ బాగానే ఉంటూ …అంతర్గత వేదికల మీద మాట్లాడుకునే వారట.. ఇప్పుడు ఏది అయిన రచ్చకెక్కుతుంది అట..
మొత్తానికి చూసుకుంటే కాంగ్రెస్ సంస్కృతి బిజెపికి వచ్చింది… బిజెపి కల్చర్ కాంగ్రెస్ కు వచ్చిందనే టాక్ పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తుంది… ఒకప్పుడు కాంగ్రెస్ వర్గ విభేదాలకు కేంద్ర బిందువుగా నిలిస్తే ఇప్పుడు రాష్ట్రంలో కమలం పార్టీ వర్గ విభేదాలకు కేంద్రబిందువుగా నిలుస్తుందనే అభిప్రాయం పార్టీ వర్గాల్లోనూ వ్యక్తం అవుతుంది…. మరి కాషాయ పార్టీలో నేతలు వర్గ విభేదాలు వీడి ఏకతాటి మీదికి ఎప్పుడు వస్తారో చూడాలి.