ప్రజల సహకారంతోటి నియోజకవర్గం గ్రామాల అభివృద్ధి చేశా
సీఎం కేసీఆర్ ఆలోచనలతో సంక్షేమం అభివృద్ధి పథకాల ఫలాలు అందించాం
బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు అధైర్య పడవద్దు
ఆరు గ్యారెంటీల అమలకు సహకరిస్తాం, లేకుంటే ప్రజల పక్షాన పోరాటం చేస్తా
మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహరరెడ్డి
సిరా న్యూస్,పెద్దపల్లి;
ప్రజలు ఇచ్చిన తీర్పును సిరసావిస్తున్నానని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఓదెల జడ్పిటీసి గంట రాములుతో కలి ఆయన మాట్లాడుతూ ప్రజల సహకారంతో నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధి చేశానని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఆలోచనలతో సంక్షేమం, అభివృద్ధి, ఆరోగ్యం పథకాల ఫలాలు అందించామన్నారు. బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు అధైర్య పడవద్దని, ఆరు గ్యారెంటీల అమలకు సహకరిస్తామన్నారు. లేకుంటే ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తామన్నారు. ఉన్మాదంతో కూడిన రాజకీయాలు చేస్తే వినాశనానికి దారితీస్తాయని అన్నారు. ఉన్మాదంతో కూడిన రాజకీయాలు వినాశనానికి దారితీస్తాయని, అలాంటి రాజకీయాలు చేయడం రాజకీయ నాయకులకు తగదని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహరరెడ్డి అన్నారు. పెద్దపల్లి ఎమ్మెల్యేగా తనకు రెండుసార్లు అవకాశమిచ్చిన పెద్దపల్లి నియోజకవర్గ ప్రజల ప్రేమను మరిచిపోలేనని తెలిపారు.